ఇవాళ మీకు ఒక మంచి తెలుగు సినిమా ని పరిచయం చేయబోతున్నాను..
చాలా వరకు అందరూ చూసే ఉంటారు..ఇప్పటికి ఇంకా చూడనివారి కోసం ఈ రివ్యూ..:)
ఆ సినిమా ఏంటంటే "ఉల్లాసంగా ఉత్సాహంగా"..
పేరుకి తగ్గట్లుగానే సినిమా కూడా నిజంగానే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది...
ఈ సినిమా టాగ్ లైన్ కూడా భలేగా పెట్టారు...THE RAIN OF JOY.
ముందుగా ఈ సినిమా cast and crew మీద ఓ లుక్కు వేద్దాం..
Story, Screenplay & Direction : A.Karunakaran
Hero : Yasho Sagar
Heroine : Sneha Ullal
Music : G.V.Prakash Kumar
hero & heroine కి ఇది debut movie అవడం వల్ల కొంతమందికి hero performance నచ్చలేదు..hero expressions చూస్తే నాకు కూడా నవ్వొచ్చింది కానీ ok చూసేయొచ్చు..
ఇక సినిమా లోకి వెళ్తే ముందుగా సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి..
పైన పోస్టర్ చూసారుగా ఎంత stylish గా ఉందో..:)
మనం జనరల్ గా ఎలా ఫోటో దిగాలనుకుంటాం?
background అంతా greenish గా ఉండి total ga blur అయిపోయి మనం మాత్రమే clear గా కనిపిస్తుంటే బాగుంటుంది కదా?ఇలా...
ఇలా సినిమా మొత్తం అందం గా shoot చేస్తే?చాలా beautiful గా ఉంటుంది కదా...
I.Andrew ఈ సినిమా కి సినిమాటోగ్రఫీ చేసారు...వీరికి నా లాల్ సలామ్..:D
వర్షాకాలం లో shoot చేయడం ఈ సినిమాకి నిజంగా చాలా plus అయింది..
so నేను చెప్పొచ్చేదేంటంటే ఈ సినిమా visually beautiful అన్నమాట..
next ఇంక చెప్పుకోవాల్సింది కామెడి గురించి...
ఈ సినిమాలో అసలు ఎంత sensitive comedy ఉంటుందంటే కేక అనే చెప్ఫాలి..
sensitive అని ఎందుకు అన్నానంటే చూస్తున్నంత సేపు సినిమాలో involve అయి every frame జాగ్రత్తగా చూస్తేనే తప్ప అర్దంకావు కొన్ని jokes...
of course ఖచ్చితంగా involve అయిపోతారనుకోండి boring movie కాదు కదా..
ఈ కింది వీడియో చూడండి ఓసారి...నర్స్ ఎంటర్ అయినపుడు(at 1.24mins)....super comedy...అసలు..నేనైతే పడి పడి నవ్వేసా...
ఇలా సినిమా మొత్తం చాలా సరదాగా పేరుకి తగ్గట్లే ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుంది..:)
ఎంటో సినిమా మొత్తం super comedy గా అనిపించింది నాకైతే...
పైన video చూసాక మీకు అర్ధమయి ఉంటుంది heroine కి amnesia అని వాళ్ళ friend అబద్దం చెప్తుందని..
so తనని impress చేయటానికి hero రకరకాలు గా try చేస్తాడు..
అందులో భాగంగా ఒక super సాంగ్ ఉంటుంది...కింది video చూడండి..
చూసారు గా ఎంత అందంగా shoot చేసారో...నా favorite songs list లో చేరిపోయిందండి ఇది..
next ఇంక చెప్పుకోవాల్సింది love గురించి...
ఎంత cute గా ఉంటుందో వీళ్ళ love story అసలు...
ఒక సందర్భం లో వీళ్ళిద్దరూ కలిసి night time లో journey చేయాల్సి ఒస్తుంది..
మన hero గారు heroine ని tease చేస్తూ గడిపేస్తాడు ఆ రోజంతా...బాగుంటుంది వీళ్ళిద్దరి మద్య ఒచ్చే ప్రతి scene.
ఈ సినిమాలో సెంటిమెంట్ ని కూడా ఆయింట్మెంట్ లాగా మనకి తెలియకుండానే బాగా పూసారు కరుణాకరన్ గారు...
heroine తన చిన్ననాటి friend ని లవ్ చేస్తుంది...తన కోసం train లో బయల్దేరుతుంది...
అయితే ఆ train కి accident అయిందని తెలుస్తుంది hero కి...
దాంతో ఇంక hero గట్టి గట్టి గా అరుస్తూ ఏడుస్తుంటాడు...heroine అప్పుడు అక్కడే ఉంటుంది ఊరికి వెళ్ళదు...
hero ని అలా చూసి ఏంటిది అరవింద్ అంటుంది..
అప్పుడు hero అనే dialogue కి నేను fida అయిపోయానండీ నిజంగా...
ఏడుస్తూ ఇలా అంటాడు...
"నువ్వు నాతో లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వే లేవంటే...."
soo true కదా..
నిజమైన ప్రేమ అంటే అదేనేమో...


No Comment.................
ReplyDeletethank you friend :)
Delete