అవి నేను ఎనిమిదో తరగతి చదివే రోజులు...
అది వేరుశనక్కాయల సీజన్..మా అమ్మ ఒకరోజు పచ్చి వేరుశనక్కాయలు అమ్మేవాళ్ళు ఎవరూ రావట్లేదేంటో ఉడకబెట్టి తినక చాలా రోజులైంది అంది.
నాకు కూడా అవి అంటే ఇష్టమే కాని పొట్టు తీసి తినాలంటేనే చచ్చేంత బద్దకం..
సరే నా బద్ధకం సంగతి కాసేపు పక్కన పెడితే ఒకసారి మా ఫ్రెండ్ కి (మోహన్) మాటల సంధర్బం లో వేరు శనక్కాయల ముచ్చటి చెప్పాను..అప్పుడు వెంటనే వాడు..ఒరేయ్ మాకు వేరు శనక్కాయల తోట ఉంది అమ్మ అడిగింది అన్నావుగా రేపు రా మా ఇంటికి తోట కి వెళ్దాం అన్నాడు.
next మార్నింగ్ tom and jerry లో tom లాగా ఎగురుకుంటూ బయల్దేరా వాళ్ళింటికి..
సైకిల్ మీద 5km వెళ్లేసరికి నా దుంప తెగింది...
మొత్తానికి వెళ్లి వాడ్ని కలిసాను.
మొత్తానికి వెళ్లి వాడ్ని కలిసాను.
ఒకర్నొకరు చూసుకొని పళ్ళు ఇకిలిచ్చుకున్నాక ఇంక పద తోట కి పోదాం అన్నాడు.
ఇక అక్కడినుంచి వాళ్ళ తోట కి బయల్దేరాం.
సగం దూరం పోయాక వాడికో పెద్ద డౌటు ఒచ్చింది..
ఒరేయ్ ఇంతకి నువ్వు కవర్ తెచ్చావా అని అడిగాడు.
వాడు పకపకా నవ్వి పెద్ద కవరే తెచ్చావుగా అని ప్రయాణం start చేసాడు.
చివరికి వాళ్ళ తోట కి చేరుకున్నాం.
అంతసేపు బాగానే ఉన్నవాడల్లా అక్కడికి పోగానే మటన్ షాపు ముందు ఎముక కోసం భయం భయంగా ఎదురు చూసే దొంగ కుక్కలాగా అటు ఇటు చూస్తున్నాడు.
నాకు ఖంగారోచ్చేసి "ఏమైంది రా ఏదైనా ప్రాబ్లెమా "అని అడిగా.
అదేం లేదు రా కాని ముందు అసలు తోటలో ఎవరున్నారో చూడాలి అన్నాడు.
అదేంటి రా ఎవరుంటే ఏంటి అని నేనడిగా.
మామయ్య ఉంటే పర్లేదు గాని తాతయ్య ఉంటేనే కొంచెం ఇబ్బంది అన్నాడు.
మీ తాతయ్య అయితే ఒప్పుకోడా అని నేను అడిగా.
అవును అన్నాడు నీరసంగా..
పంచ్ పడిందిరా దేవుడా అనుకున్నామనసులో..
ముందు పద తోటలోకి ఎవరున్నారో చూద్దాం అన్నాడు.
ఇంక వెంటనే ఐస్ గడ్డల మీద పాకే పెంగ్విన్ పక్షుల్లా పాకుకుంటా తోట లోకి దూరాం.
ఏపుగా పెరిగిన మొక్కల మద్యలో కూర్చున్నాం(అదే దాక్కున్నాం).
వాడు మొక్కల మధ్యలోంచి తొంగి చూసి "బాబోయ్ తాత తగలడ్డాడు రా చూడు అన్నాడు".
దెబ్బకి నా ప్రాణం ఉసూరుమన్నది..నిరాశ నిస్పృహ అంటే ఇదేనేమో అని ఏవేవో అనుకుంటున్నా మనసులో.
ఇంతలో వాడు లే రా చూడు మా తాత ని అన్నాడు.
నేను లేచి చూసా..
షాక్...
adobe photoshop లో Gaussian blur effect ఇచ్చినట్లు అంతా మసకగా ఉంది.
అప్పుడు గుర్తొచ్చింది మనం గుడ్డి కొంగలమని..speds ఇంట్లో తగలడ్డాయి అని.
హా కనిపించాడు ఆయనేనా మీ తాతయ్య మరి ఇప్పుడేంటి పరిస్థితి అని అడిగా(తెగ కవర్ చేసాలెండి కనిపించినట్లు).
ఏముంది కాయలు కోసిన తర్వాత నేను వెళ్లి చెప్తా నాన్న తెమ్మన్నాడని అప్పుడేం అనడులే అని అభయ హస్తం ఇచ్చాడు.
నాకు భయం వేసింది..బాగోదేమో లేరా..అయినా risk ఎందుకు చెప్పు next time ఒస్తాలేరా అన్నా వాడితో.
ఒరేయ్ నిజంగానే ఏమనడులేరా నువ్ కంగారు పడకు..నాకు ఒదిలెయ్ అదంతా అన్నాడు.
వాడి జేబులోని కవర్ తీసి ఇంక కాయలు కొయ్యడం start చేద్దాం పట్టు అన్నాడు.
అంత సేపు కంగారులో ఉన్న నేను మొక్కల వైపు చూసా..
బిచ్కావ్..(background music)...
పంచ్ పడింది.
అయోమయం లో తిక్కతిక్క గా చూస్తున్న నన్ను చూసి ఏమైందిరా అని అడిగాడు.
నీయబ్బ ఏ తోటలోకి తీసుకోచ్చావ్ రా నన్ను??ఒక్క శనగకాయ కూడా కనిపించట్లేదు??ఇది అసలు వేరు శనగ తోటేనా??అన్నా కోపంగా..
వాడు ఒక్క క్షణం silent గా ఉండి angry birds game లో పంది లాగా పక పకా నవ్వటం start చేసాడు.
కోపం,confusion అన్నీ కలిసి Mr.Bean కన్నా దారుణమైన face expressions పెట్టి నేను వాడికేసి చూస్తున్నా.
వాడు ఒక పావ్ గంట దాక పొట్ట పగిలేలా నవ్వ్వి ...
ఒక మొక్క పీకి చూపించాడు..
అదేంటో విడ్డూరంగా శనగకాయలు వేర్లకి వేలాడుతున్నాయి..
అప్పుడు అర్థమైంది శనగకాయలు అంత మురికిగా ఎందుకుంటాయో అని.
ఇంక మొక్కలు పీకడం షురూ చేసాం.
మొక్కలు పీకడం లో ఇంత ఆనందం ఉందని చంద్రబాబు గారి జన్మభూమి లో గడ్డి పీకుతున్నపుడు అర్థంకాలేదు.
కవర్ నిండే దాకా కాయలు కోసి ఇంక వెళ్ళు మీ తాత దగ్గిరికి అని లటుక్కున మొక్కల మధ్యలోంచి లేచి నిలబడ్డా.
ఏయ్ ఎవడ్రా అక్కడ అని ఎవడో ఉరికొస్తున్నాడు.
ఏయ్ ఎవడ్రా అక్కడ అని ఎవడో ఉరికొస్తున్నాడు.
వీడు కూడా లేచి ఒరేయ్ పద పదా ఉరుకూ ఇది మా తోట కాదూ... వాడు మా తాత కాదూ.... ఉరుకురోయ్ అంటూ running start చేసాడు.
నా గుండె ప్యాంటు లోకి ఒచ్చేసింది దెబ్బకి.
ఇక చూస్కో నా సామి రంగా ఊరకుక్క కన్నా దారుణంగా ఉరకడం start చేశా.
ఎలాగోలా అక్కడినుండి పారిపొయ్ ఒచ్చాక..
వాడ్ని కుక్క దొబ్బులు దొబ్బి..
దొరికితే బట్టలిప్పి తోటలో దిష్టి బొమ్మలా మనల్ని వేలడతీసేవారు కదరా అయినా నీకదేం పోయేకాలం రా.
దొరికితే బట్టలిప్పి తోటలో దిష్టి బొమ్మలా మనల్ని వేలడతీసేవారు కదరా అయినా నీకదేం పోయేకాలం రా.
దొంగతనం చేయిస్తావా నాతో అని వాడ్ని కాసేపు తిట్టా.
వాడు ఇవేం పట్టించుకోకుండా saw సినిమా లో sadist లాగా నవ్వుతున్నాడు.
భలే సరదాగా ఉంది కదా??అన్నాడు మెల్లిగా.
అప్పుడే నాకు అర్థమైంది రాక్షసానందం అంటే ఇదే అని.
ఒక half an hour తర్వాత నా pulse మామూలు స్థాయి కి ఒచ్చింది.
నేను మా ఇంటికి వెళ్లేముందు..
ఒరేయ్ జాగ్రత రా బాబు ఏదో లక్కు లో బయటపడ్డాం కానీ ఇంకోసారి అటువైపు వెళ్ళకు అని అన్నా.
భలేవాడివే మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తా రా వేరే తోటలు చాలా ఉన్నాయి గా ఇంకా అన్నాడు serious గా.
యే బిచ్కావ్...










