Tuesday, 1 November 2011

చేపల వేట

నాకు fishing అంటే చాలా ఇష్టం.నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒకసారి మా friends(5 members) తో ఈ విషయం గురించి చెబితే వెంటనే మా మంద లో ఒకడు (పేరు వినోద్) ఇలా అన్నాడు..
"ఒరేయ్ మా ఊర్లో పెద్ద చెరువు ఉంది రా...ఎలాగూ రేపు sunday నే కదా మీరంతా మా ఊరు రండి.మా ఇల్లు చూసినట్లు ఉంటుంది & సరదాగా fishing కుడా చేయొచ్చు..మీరు రేపు ఒచ్చేసరికి గాలాలు (చేపలు పట్టటానికి use చేసే sticks) ready చేయించి ఉంచుతాను రా ఏమంటారు? అన్నాడు"

దానికి మేమంతా ok అనేసాం..
వినోద్ వాళ్ల ఊరు మా ఊరి నుండి 6km ఉంటుంది..వాడు రోజు cycle మీద కాలేజ్ కి up & down చేసేవాడు..
cycle మీద 6km journey & తర్వాత fishing అని తలుచుకోగానే మా అందరికి ఒక adventure లాగా అనిపించింది..
next morning మేం నలుగురం dil chahta hai సినిమా లో లాగా బయల్దేరాం...














మొత్తానికి ఎలాగో అలాగ 6km cycle journey చేసి వాడి ఇంటికి చేరుకున్నాం..వాళ్ళింటి కి వెళ్ళగానే వాళ్ళ family members కి మమ్మల్ని పరిచయం చేసాడు..
ఇంటిదగ్గర బయల్దేరేముందు college students లాగానే ఉన్నాం కానీ ఆ cycle journey తర్వాత రిక్షా తొక్కుకొనేవాళ్ళ లాగా తయారయ్యాం..
ఇంక ఇంట్లో formalities అన్నీ అయిపోయాక వాడి కి సైగ చేసాం చేపలు పడదాం పద రా ఇంక అని...
వాడు serious గా ఇంట్లో కి వెళ్ళి ఒక గొడ్డలి తెచ్చి మా చేతిలో పెట్టాడు..



దెబ్బకి మా fuse లు ఎగిరిపోయాయి...ఇంట్లోకి వెళ్ళి గాలాలు తెస్తావనుకుంటే ఇదేంట్రా గొడ్డలి ఇచ్చావ్?? అని అడగ్గా.

పనివాడు రాలేదు రా గాలాలు మనమే తయారు చేసుకోవాలి తప్పదు రా అని సెలవిచ్చాడు..
ఈసారి మా transformers పేలిపోయాయ్...
సరేలే ఇంక చేసేదేమిలేక గాలాల తయారీ కార్యక్రమం start చేసాం..
ఆ క్షణంలో వాడు మాత్రం నా కంటికి "దగ్గరుండి శ్రమదానం చేయిస్తున్న చంద్రబాబు" లా కనిపించాడు..

ఈ మొత్తం ప్రోగ్రాం లో అత్యంత చిరాకు తెప్పించే విషయం ఏంటంటే ఎర్రలు(earthworms) తవ్వడం..
దేవుడి దయ వల్ల ఎలాగో ఆ తంతు కూడా పూర్తిచేసి చెరువు కి పయనమయ్యాం..

కనీసం గూగుల్ ఎర్త్ లో కూడా కనిపించనంత చిన్న ఊరిలో మమ్మల్ని ఆ చెరువు కోసం ఎంతలా నడిపించాడంటే మా వాలకం చూస్తే నిజంగానే చేపలు పట్టి అమ్ముకొనే వాళ్ళలాగా తయారయ్యాం...
తీరా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూసాక నవ్వకుండా ఉండలేక పోయాం..
పెద్ద చెరువు అనగానే  పసిఫిక్ ocean కి ఉపనది లాగా ఉంటుందేమో అని మేము ఊహించుకుంటే పంట చేల కోసం తీసిన పిల్ల కాలువ చూపించి ఇదేరా మా చెరువు అన్నాడు మా సుంట..

వాడు ఇలా రకరకాల twist లు ఎన్ని ఇచ్చినా ఓపిక నశించకుండా తట్టుకున్నది చేపలు పడదామన్న ఒక్క  సరదా తీర్చుకోడానికే..
సరే ఎంత చిన్న చెరువైతే ఎముందిలే కాని కనీసం ఇందులో ఒక్క చేప ఐనా ఉందా రా అని అడిగితే..
మా ఊర్లో చేపల కూర ఎవరైనా వండారంటే అది sure గా ఇక్కడి చేప నే అయి ఉంటుంది తెలుసారా అన్నాడు..
ఓహో సరేలే మంచిది అని చేపల వేట కు ఉపక్రమించాం..

మేం మా ఇంటి దగ్గర ఉదయం బయల్దేరితే చెరువు దగ్గర కి ఒచ్చేసరికి మద్యాహ్నం అయింది.
ఒక పక్క ఎండ దంచుతోంది..
మా కర్మ కాలి ఆ కాలువ పక్కన (oh sorry చెరువు పక్కన) ఎటు చూసినా బండలే ఉన్నాయి..
ఇక చేసేదేమిలేక ఆ బండల మీదే settle అయ్యాం..

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమయింది..
చేతి లో గాలం ఎదురుగా చెరువు...చెరువు లో చేపలు....ఆహా చాలా exciting గా feel అయ్యాం అందరం..
గాలం వేసి గుంట కాడ నక్క లాగా చూస్తున్నాం..



5mins అయింది...
15mins అయింది...
వెయిట్ చేస్తున్నాం..
20mins అయింది...
గాలానికి కట్టిన బెరడు కదులుతుందేమో అని రెప్ప కూడా కొట్టకుండా ఆత్రంగా చూస్తున్నాం..
45mins అయింది...
బెరడు కనీసం గాలి కి కూడా కదలట్లేదు..
కింద ఏమో బండలు ఎండ కి కాలుతున్నాయ్..
ఇంక ఓపిక నశించింది...ఆవేశం పెరిగిపోతోంది...
ఒరేయ్ నీ ఎంకమ్మ అసలు ఇందులో చేపలు ఉన్నాయా రా??కనీసం కప్పలైనా ఉన్నాయంటావా??
వినోద్ గారి మొహం లో no feelings..
కౌన్ బనేగా కరోర్ పతి లో 1st  question కే answer తెలియకపోతే పెట్టినట్లు బిత్తిరి మొహం పెట్టాడు.

సరేలే ఇంక వెళ్ళిపోదామని decide అయి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాక చెప్పాడు అసలు సంగతి.

మొన్న ఎవరో చెరువు లో చేపల విషం కలిపారంటే నేను నమ్మనేలేదు రా..కాని ఇప్పుడు అర్దమయింది అది నిజమే రా....అని చెప్పాడు హ్యాపీడేస్ సినిమాలో టైసన్ లాగా అమాయకంగా....


3 comments: